AP TG Weather Updates : బలపడుతున్న'దానా' తుపాన్..! ఏపీ తీర ప్రాంతాలకు హెచ్చరికలు
- Cyclone Dana : తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్… రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంది. గురువారం లేదా శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏపీలోని తీర ప్రాంత ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Cyclone Dana : తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్… రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంది. గురువారం లేదా శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఏపీలోని తీర ప్రాంత ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
(1 / 7)
తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది రేపటికి(అక్టోబర్ 24) వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.
(2 / 7)
ఈ తుపానుకు 'దానా'గా నామకరణం చేశారు.
గడిచిన 6 గంటల్లో గంటకు 18కిమీ వేగంతో కదులుతోంది. తుపాన్
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
(3 / 7)
పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పారాదీప్(ఒడిశా)కి 560 కిమీ,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్)630కిమీ,ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 630కిమీ దూరంలో ఉంది
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని…
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
(4 / 7)
ఇవాళ ఏపీలో (23 అక్టోబర్)ని కర్నూలు,నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి, అన్నమయ్య,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం,నెల్లూరు,వైఎస్ఆర్,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(5 / 7)
వైఎస్ఆర్,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(6 / 7)
ఇక తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు