india vs england: కలిసొచ్చిన కటక్.. బారాబతి స్టేడియంలో భారత్ దే ఆధిపత్యం.. ఇంగ్లండ్ తో రెండో వన్డేలో జోరు కొనసాగేనా?
india vs england: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డేకు వేదికైన బారాబతి స్టేడియంలో టీమ్ఇండియాదే ఆధిపత్యం. ఈ జోరు కొనసాగించి ఆదివారం (ఫిబ్రవరి 9) మ్యాచ్ లో గెలవాలన్నదే రోహిత్ సేన లక్ష్యం.
(1 / 5)
భారత్, ఇంగ్లండ్ మధ్య ఆదివారం రెండో వన్డేకు కటక్ లోని బారాబతి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ ఇప్పటివరకూ 17 వన్డేలు ఆడిన టీమ్ఇండియా 13 మ్యాచ్ ల్లో గెలిచింది.
(PTI)(2 / 5)
45 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో 1982లో భారత్ తొలి వన్డే ఆడింది. అది కూడా ఇంగ్లండ్ తోనే కావడం విశేషం. చివరి వన్డే 2019లో వెస్టిండీస్ తో టీమ్ఇండియా ఆడింది. ఇక్కడ ఇంగ్లండ్ తో ఆడిన 5 వన్డేల్లో భారత్ 3 గెలిచి, 2 ఓడింది.
(PTI)(3 / 5)
బారాబతి స్టేడియంలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు రికార్డు భారత్ పేరు మీదే ఉంది. 2017లో ఇంగ్లండ్ పై 381/6 స్కోరు చేసింది. ఆ మ్యాచ్ లో చెలరేగిన స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 150 పరుగులతో సత్తాచాటాడు. అతని ఇన్నింగ్స్ లో 21 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి.
(x/Yuvraj Singh)(4 / 5)
బారాబతి స్టేడియంలో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ లెజెండ్ సచిన్ పేరిట కొనసాగుతోంది. ఇక్కడ 10 వన్డేల్లో అతను 469 పరుగులు చేశాడు. ఇప్పుడు జట్టులో ఉన్నవాళ్లలో రోహిత్ శర్మ (3 మ్యాచ్ ల్లో 143 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
(x/wemissyousachin)ఇతర గ్యాలరీలు