(1 / 5)
క్రిస్టియానో రొనాల్డో తనయుడు క్రిస్టియానో డాస్ శాంటోస్ ఫుట్‌బాల్ లో అడుగుపెట్టాడు. పోర్చుగల అండర్-15 టీమ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి బాటలో సాగుతున్న ఈ కుర్రాడు అదరగొడుతున్నాడు.
(AFP)(2 / 5)
వ్లాట్కో మార్కోవిచ్ ఇంటర్నేషనల్ టోర్నీ లో జపాన్ తో మ్యాచ్ లో పోర్చుగల అండర్-15 టీమ్ తరపున జూనియర్ క్రిస్టియానో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్ లో పోర్చుగల్ 4-1 తేడాతో జపాన్ పై గెలిచింది.
(AFP)(3 / 5)
జపాన్ తో మ్యాచ్ లో 54వ నిమిషంలో వచ్చిన క్రిస్టియానో డాస్ శాంటోస్ ఫార్వర్డ్ ప్లేయర్ గా మంచి స్కిల్స్ ప్రజెంట్ చేశాడు. 14 ఏళ్ల జూనియర్ క్రిస్టియానో ఇప్పటికే జూనియర్ లెవల్ లో అదరగొడుతున్నాడు. జువెంచస్ యూత్ అకాడమీ తరపున 58 గోల్స్ కొట్టాడు. ప్రస్తుతం అల్ నాసర్ అకాడమీకి ఆడుతున్నాడు.
(AFP)(4 / 5)
పోర్చుగల్ అండర్-15 టీమ్ లోకి తన మనవడు జూనియర్ రొనాల్డో ఎంట్రీ సందర్భంగా గ్రాండ్ మదర్ మారియా ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ ముగిశాక క్రిస్టియానో జూనియర్ కు ముద్దు పెట్టారు. తండ్రి లాగే జూనియర్ కూడా ఏడో నంబర్ జెర్సీతో ఆడుతున్నాడు.
(AFP)(5 / 5)
కొడుకు డెబ్యూపై రొనాల్డో సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రొనాల్డో, తన పార్ట్ నర్ జార్జినా రోడ్రిగ్స్ కు అయిదుగురు పిల్లలు.
(x/cristiano ronaldo)ఇతర గ్యాలరీలు