World Cup 2023 Semi Finals: వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍ల తేదీలు, టైమింగ్స్, లైవ్ వివరాలివే..
Cricket World Cup 2023 Semi Finals: ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ లీగ్ దశ మ్యాచ్‍లు ముగిశాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాలను దక్కించుకున్న భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీఫైనల్‍కు చేరుకున్నాయి. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‍ల వివరాలివే..
(1 / 6)
ప్రస్తుత వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍కు భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేరుకున్నాయి. లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో తొమ్మిది గెలిచి అజేయంగా పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచింది భారత్. సెమీస్‍లో ఆత్మవిశ్వాసంలో అడుగుపెడుతోంది. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‍ల వివరాలు ఇక్కడ చూడండి.
(2 / 6)
IND vs NZ: ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నవంబర్ 15వ తేదీన జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా 15న మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.
(AFP)(3 / 6)
2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‍లోనూ న్యూజిలాండ్‍తోనే భారత్ పోటీ పడింది. అయితే, అప్పుడు భారత్ ఓటమి పాలైంది. అయితే, ప్రస్తుతం 2023 వరల్డ్ కప్‍లో టీమిండియా ఫుల్ జోష్‍లో ఉంది. ఈ సెమీస్ గెలిచి న్యూజిలాండ్‍పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
(PTI)(4 / 6)
వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ రెండో సెమీ ఫైనల్‍లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
(REUTERS)(5 / 6)
ఆసీస్, దక్షిణాఫ్రికా మధ్య ఈ రెండో సెమీస్ నవంబర్ 16వ తేదీన కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.
(REUTERS)(6 / 6)
ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍లు స్టార్ స్పోర్ట్స్ టీవీ చానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్ విషయానికి వస్తే, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఇక, సెమీఫైనళ్లలో గెలిచే రెండు జట్లు నవంబర్ 19న ఫైనల్‍లో తలపడనున్నాయి. ఈ టైటిల్ ఫైట్ అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.
(AP)ఇతర గ్యాలరీలు