Dhoni Emotional : ధోనీని ఇంత ఎమోషనల్​గా ఎప్పుడూ చూడలేదు.. బెస్ట్ మూమెంట్-cricket news ipl 2023 final photos csk skipper ms dhoni lifts ravindra jadeja chennai super kings vs gujarat titans jra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cricket News Ipl 2023 Final Photos Csk Skipper Ms Dhoni Lifts Ravindra Jadeja Chennai Super Kings Vs Gujarat Titans Jra

Dhoni Emotional : ధోనీని ఇంత ఎమోషనల్​గా ఎప్పుడూ చూడలేదు.. బెస్ట్ మూమెంట్

May 30, 2023, 11:05 AM IST HT Telugu Desk
May 30, 2023, 11:05 AM , IST

  • MS Dhoni lifts Ravindra Jadeja : ఐపీఎల్ లో గుజరాత్ పై చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విజయం సాధించింది. అయితె మ్యాచ్ గెలిచిన తర్వాత.. ఎప్పుడూ లేని విధంగా మిస్టర్ కూల్ ఎమోషనల్ అయ్యాడు. రవీంద్ర జడేజాను ఎత్తుకున్నాడు.

ఐపీఎల్ ఫైనల్ లో రవీంద్ర జడేజా హీరోగా నిలిచాడు. చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక బౌండరీ కొట్టి.. చెన్నై సూపర్ కింగ్స్‌కు టైటిల్‌ను అందించాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా జడేజా మ్యాజిక్ చేశాడు.

(1 / 8)

ఐపీఎల్ ఫైనల్ లో రవీంద్ర జడేజా హీరోగా నిలిచాడు. చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక బౌండరీ కొట్టి.. చెన్నై సూపర్ కింగ్స్‌కు టైటిల్‌ను అందించాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా జడేజా మ్యాజిక్ చేశాడు.(AFP)

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ తరఫున వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ చేశాడు.

(2 / 8)

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ తరఫున వృద్ధిమాన్ సాహా హాఫ్ సెంచరీ చేశాడు.(PTI)

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. అయితే 90 పరుగుల మార్క్ దాటిన తర్వాత ఔటయ్యాడు. చెన్నైకి చెందిన సాయి చెన్నై జట్టుకే కొరకరాని కొయ్యగా మారాడు.

(3 / 8)

గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్ చేశాడు. అయితే 90 పరుగుల మార్క్ దాటిన తర్వాత ఔటయ్యాడు. చెన్నైకి చెందిన సాయి చెన్నై జట్టుకే కొరకరాని కొయ్యగా మారాడు.(PTI)

సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రిజర్వ్ డే సందర్భంగా ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్‌ వేశారు.

(4 / 8)

సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రిజర్వ్ డే సందర్భంగా ఐపీఎల్ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్‌ వేశారు.(ANI)

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే 47 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

(5 / 8)

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే 47 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.(AFP)

అజింక్యా రహానే కూడా బాగానే ఆడాడు. 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

(6 / 8)

అజింక్యా రహానే కూడా బాగానే ఆడాడు. 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.(AFP)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు అంబటి రాయుడు 19 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే చివరి మ్యాచ్.

(7 / 8)

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు అంబటి రాయుడు 19 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే చివరి మ్యాచ్.(AFP)

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయంతో టైటిల్‌ను గెలుచుకుంది. చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేసిన రవీంద్ర జడేజా హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజాను ఎత్తుకుని సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఈ ఫోటో అద్భుతంగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎప్పుడూ లేనివిధంగా ధోనీ ఎమోషనల్ అయ్యాడు.

(8 / 8)

గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయంతో టైటిల్‌ను గెలుచుకుంది. చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేసిన రవీంద్ర జడేజా హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ రవీంద్ర జడేజాను ఎత్తుకుని సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఈ ఫోటో అద్భుతంగా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎప్పుడూ లేనివిధంగా ధోనీ ఎమోషనల్ అయ్యాడు.(twitter)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు