తెలుగు న్యూస్ / ఫోటో /
Yashasvi Jaiswal: విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన యశస్వి జైస్వాల్
- IND vs ENG - Yashasvi Jaiswal: ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు భారత్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ రికార్డును అతడు సమం చేశాడు.
- IND vs ENG - Yashasvi Jaiswal: ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు భారత్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఓ రికార్డును అతడు సమం చేశాడు.
(1 / 5)
ఇంగ్లండ్‍తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‍లో భారత్ యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్‍లో నాలుగు టెస్టుల్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు చేశాడు జైస్వాల్. (AP)
(2 / 5)
ఇప్పటి వరకు ఈ టెస్టు సిరీస్‍లో యశస్వి జైస్వాల్ 655 పరుగులు చేశాడు. ఇందులో రెండు ద్విశతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 రన్స్ చేశాడు జైస్వాల్. దీంతో ఈ సిరీస్‍లో 655 పరుగులకు చేరాడు.(AP)
(3 / 5)
ఇంగ్లండ్‍పై టెస్టు సిరీస్‍లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డును యశస్వి జైస్వాల్ సమం చేశాడు. 2017లో ఇంగ్లిష్ జట్టుతో జరిగిన సిరీస్‍లో కోహ్లీ 655 రన్స్ చేశాడు. దీన్ని జైస్వాల్ ఇప్పుడు ఈక్వల్ చేశాడు. అయితే, ధర్మశాలలో ఐదో టెస్టు కూడా జరగనుండగా..ఈ కోహ్లీ రికార్డును జైస్వాల్ అధిగమించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. (AFP)
(4 / 5)
ఐదో టెస్టులో యశస్వి జైస్వాల్ మరో 45 రన్స్ చేస్తే.. ఇంగ్లండ్‍పై సిరీస్‍లో 700 రన్స్ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలువనున్నాడు. 120 పరుగులు చేస్తే.. ఓ టెస్టు సిరీస్‍లో అత్యధిక రన్స్ చేసిన టీమిండియా ఆటగాడిగా సునీల్ గవాస్కర్ (774 పరుగులు)ను జైస్వాల్ అధిగమిస్తాడు.(PTI)
ఇతర గ్యాలరీలు