Corn Benefits: మొక్కజొన్నతో కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే వదిలి పెట్టరు!
Corn Benefits: మొక్కజొన్న అంటే చాలా మందికి ఇష్టం. వీటిని కాల్చుకుని, ఉడికించకుని తింటారు.ఈ గింజలతో పాప్‌కార్న్ చేసుకుని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు తయారు చేసుకుని కూడా తింటుంటారు. ఎలా తిన్నా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
(1 / 7)
మొక్కజొన్నలు చాలా రుచికరంగానూ, ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
(shutterstock)(2 / 7)
జీర్ణక్రియ పెంచుతుంది:
మొక్కజొన్నలోని ఫైబర్ ప్రేగు కదలికకు సహాయపడటమే కాకుండా ఉబ్బరం వంటి సమస్యలు నివారిస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన గట్, మైక్రోబయోమ్ ను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు దోహదపడుతుంది.
(3 / 7)
కంటి ఆరోగ్యానికి మేలు:
మొక్కజొన్నలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
(4 / 7)
గుండె ఆరోగ్యానికి మద్దతు:
మొక్కజొన్నలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇంకా వీటిలో ఉండే పొటాషియం ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది.
(5 / 7)
ఆరోగ్యకరమైన చర్మం కోసం:
మొక్కజొన్నల్లో ఉండే విటమిన్ సీ చర్మానికి అవసరమైన కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాకుండా ముడతలను తగ్గించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
(6 / 7)
తక్షణ శక్తిని అందిస్తుంది:
మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లు ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కార్బొహైడ్రేట్లు మీ శరీరానికి మంచి శక్తి వనరులుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల చురుకుగా ఉంచడానికి సహాయపడతాయి.
ఇతర గ్యాలరీలు