
(1 / 6)
ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ వచ్చిన అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఇదీ ఒకటి. 2023లో రిలీజైంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(2 / 6)
'ది కేరళ స్టోరీ' మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. 'లవ్ జిహాద్' వంటి సున్నితమైన అంశంపై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.

(3 / 6)
ఈ సినిమాలో అదా శర్మ, సిద్ధి ఇద్నానీ, యోగితా బిహానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సబ్జెక్ట్ పై చాలా వివాదాలు తలెత్తాయి.

(4 / 6)
'ది కేరళ స్టోరీ' వంటి వివాదాస్పద సినిమా విడుదలైన తర్వాత కూడా నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా పోలీసు రక్షణ తీసుకోవడానికి నిరాకరించాడు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లు సాధించింది.

(5 / 6)
'ది కేరళ స్టోరీ'పై పలువురు నిరసన వ్యక్తం చేయగా, పలువురు మెచ్చుకున్నారు. అంతేకాదు ఈ సినిమాను రాజకీయంగా కూడా వ్యతిరేకించారు.

(6 / 6)
రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' ప్రపంచవ్యాప్తంగా రూ.303.97 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 2023 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన తొమ్మిదో హిందీ మూవీగా నిలిచింది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు