Contrast Blouses: అన్ని చీరలకు సెట్ అయ్యే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు, ఈ కలర్ కాంబినేషన్ మీ లుక్‌నే మారుస్తుంది!-contrast colour blouses for all sarees this color combination will change your stunning look ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Contrast Blouses: అన్ని చీరలకు సెట్ అయ్యే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు, ఈ కలర్ కాంబినేషన్ మీ లుక్‌నే మారుస్తుంది!

Contrast Blouses: అన్ని చీరలకు సెట్ అయ్యే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు, ఈ కలర్ కాంబినేషన్ మీ లుక్‌నే మారుస్తుంది!

Jan 07, 2025, 08:00 AM IST Ramya Sri Marka
Jan 07, 2025, 08:00 AM , IST

Contrast Blouses: ఏదైనా ఈవెంట్ కోసం చీరను ఎంచుకునేటప్పుడు, దానికి సరిపోయే బ్లౌజ్‌ను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. బ్లౌజ్ డిజైన్, ఎంబ్రాయిడరీ వర్క్‌లతో పాటు కలర్ కాంబినేషన్ మీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లు తెలుసుకుని మీరూ ట్రే చేయండి.  

చీర ఎంత బాగున్నా దానికి సెట్ అయ్యే బ్లూజ్ వేసుకోకపోతే  చీర అందమంతా చెడిపోతుంది.అందుకే చాలా మంది చీర కన్నా ఎక్కువ జాకెట్ కోసమే ఖర్చు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలనుకుంటారు. ఈ మధ్య చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ కన్నా కాంట్రాస్ట్ కలర్లే బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరూ కాంట్రాస్ట్ రంగులను ట్రై చేయాలనుకుంటే  మీ దగ్గరున్న చీరకు ఏ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆకర్షణీయంగా ఉంటుందో తెలుసుకోండి.

(1 / 8)

మీ దగ్గర బంగారు రంగు కాంజీవరం చీర ఉంటే దాన్ని పర్పుల్ కలర్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేసుకోవచ్చు.శ్రీదేవి-బోనీకపూర్ కూతురు ఖుషీ కపూర్‌ వేసుకున్న ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ట్రెండింగ్ అయింది.

(2 / 8)

ముదురు గులాబీ రంగు చీర మీ దగ్గర ఉంటే దాన్ని ఆకుపచ్చ బ్లౌజ్‌తో మ్యాచ్ చేసుకోవచ్చు.ఇది కూడా డిఫరెంట్‌గా, యూనిక్‌గా కలర్ కాంబినేషన్ అవుతోంది. మ్యాచింగ్ జువెలరీ కూడా ధరిస్తే ఖచ్చితంగా హీరోయిన్ యామీ గౌతమ్ లాగా ఆకర్షణీయంగా కనిపిస్తారు.

(3 / 8)

నోరా ఫతేహి ధరించిన ఈ చీర, బ్లౌజ్ ఒకే రంగులో లేకపోయినా ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయో చూడండి.ఆకుపచ్చ బనారసి పట్టు చీరకు పర్పుల్ లేదా వెల్వెట్ రంగు బ్లౌజ్‌లు చక్కగా సరిపోతాయి.

(4 / 8)

టాలీవుడ్ ఫేమ్ హీరోయిన్,  ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ స్టన్నింగ్ కాంబినేషన్లో చాలా అందంగా కనిపిస్తున్నారు కదా.   పింక్, గ్రీన్ స్లీవ్‌లెస్ ఎంబ్రాయిడరీ  బ్లౌజ్‌తో గోల్డ్-సిల్వర్ కలిసి ఉన్న చీరను సరిపోల్చి, బ్లౌజ్ అంచున బోర్డర్ తో చీరకు మ్యాచ్ అయ్యేలా ట్రై చేసింది. ఈ కాంబినేషన్ ట్రై చేశారంటే సింపుల్‌గా అదరగొట్టేయచ్చు. 

(5 / 8)

ఆకుపచ్చ కాటన్ చీరకు లేత పసుపు రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేసి వావ్ అనిపించింది అంకితా లోఖండే. ఇది నిజంగా చాలా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

(6 / 8)

హిందీ బుల్లితెర నటి రుబీనా ముదురు ఎరుపు రంగు కాటన్ చీరపై సింపుల్ బ్లాక్ బ్లౌజ్ ధరించింది.ఈ చీర చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఏదేమైనా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ మ్యాచింగ్ అనే చెప్పాలి.

(7 / 8)

బాలీవుడ్ నటి, ధక్ ధక్ బ్యూటీ మాధురీ దీక్షిత్ చీరకు సరిపోయే బ్లౌజ్‌కు బదులుగా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్‌ను ధరించింది.డార్క్ పింక్ ప్రింటెడ్ చీరలో చాలా సింపుల్ డార్క్ బ్లూ బ్లౌజ్ తో అందంగా కనిపిస్తోంది. ఈ డెడ్లీ కాంబినేషన్ ను మీరూ ట్రై చేసి చూడండి.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు