Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం: మంత్రులు కూడా..: ఫొటోలు-conrad sangma takes oath as meghalaya cm for 2nd consecutive term details with pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం: మంత్రులు కూడా..: ఫొటోలు

Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం: మంత్రులు కూడా..: ఫొటోలు

Mar 07, 2023, 12:57 PM IST Chatakonda Krishna Prakash
Mar 07, 2023, 12:57 PM , IST

  • Meghalaya CM Conrad Sangma: మేఘాలయ ముఖ్యమంత్రిగా కాన్రాడ్ సంగ్మా.. మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొందరు మంత్రులు కూడా నేడు ప్రమాణం చేశారు.

Conrad K Sangma: మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (National People's Party - NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా వరుసగా రెండో దఫా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 

(1 / 8)

Conrad K Sangma: మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (National People's Party - NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా వరుసగా రెండో దఫా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. (Twitter/@ANI)

షిల్లాంగ్‍లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

(2 / 8)

షిల్లాంగ్‍లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.(Twitter/@ANI)

ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రులతో కలిసి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ప్రార్థనలు చేశారు. 

(3 / 8)

ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రులతో కలిసి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా.. ప్రార్థనలు చేశారు. (Twitter/@ANI)

షిల్లాంగ్‍లోని రాజ్‍భవన్‍లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.

(4 / 8)

షిల్లాంగ్‍లోని రాజ్‍భవన్‍లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.(Twitter/@ANI)

60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయలో ఎన్‍పీపీ కూటమికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంట్లో ఎన్‍పీపీకి 26 సీట్లు ఉండగా.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

(5 / 8)

60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయలో ఎన్‍పీపీ కూటమికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంట్లో ఎన్‍పీపీకి 26 సీట్లు ఉండగా.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.(Twitter/@ANI)

కొత్తగా ఎన్నికైన 58 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ తిమోతీ డి షిరా.. అసెంబ్లీలో సోమవారం  ప్రమాణ స్వీకారం చేయించారు. 

(6 / 8)

కొత్తగా ఎన్నికైన 58 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ తిమోతీ డి షిరా.. అసెంబ్లీలో సోమవారం  ప్రమాణ స్వీకారం చేయించారు. (Twitter/@ANI)

ఎన్‍పీపీకి చెందిన ప్రెస్టోన్ టైన్‍సాంగ్ (Prestone Tynsong), స్నియాబవలంగ్ ధార్ (Sniawbhalang Dhar) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

(7 / 8)

ఎన్‍పీపీకి చెందిన ప్రెస్టోన్ టైన్‍సాంగ్ (Prestone Tynsong), స్నియాబవలంగ్ ధార్ (Sniawbhalang Dhar) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.(Twitter/@ANI)

బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లలూ హెక్ (Alexander Laloo Hek), యూడీపీకి చెందిన పౌల్ లింగ్‍దో (Paul Lyngdoh), కిర్మెన్ షిల్లా (Kyrmen Shylla) మంత్రులుగా ప్రమాణం చేశారు. 

(8 / 8)

బీజేపీకి చెందిన అలెగ్జాండర్ లలూ హెక్ (Alexander Laloo Hek), యూడీపీకి చెందిన పౌల్ లింగ్‍దో (Paul Lyngdoh), కిర్మెన్ షిల్లా (Kyrmen Shylla) మంత్రులుగా ప్రమాణం చేశారు. (Twitter/@ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు