Bhatti Padayatra : 500 గ్రామాలు, 30 నియోజకవర్గాలు - 1000 కి.మీ దాటిన భట్టి పాదయాత్ర
- Bhatti Vikramarka Peoples March Padayatra: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కచేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. వెయ్యి కిలో మీటర్ల మైలురాయిని కూడా దాటింది. మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర... ఇవాళ్టితో 86వ రోజుకి చేరింది. భట్టి పాదయాత్రకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
- Bhatti Vikramarka Peoples March Padayatra: కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కచేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. వెయ్యి కిలో మీటర్ల మైలురాయిని కూడా దాటింది. మార్చి 16న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర... ఇవాళ్టితో 86వ రోజుకి చేరింది. భట్టి పాదయాత్రకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 8)
ఈ పాదయాత్రలో 500 వందలకు పైగా గ్రామాలు.. తండాలు, పల్లెలు, పట్టణాలు కవర్ అయ్యాయి.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చటం లక్ష్యంగా ఈ పాదయాత్ర ముందుకు కొనసాగుతోంది.
(twitter)(2 / 8)
పాదయాత్రలో భాగంగా గిరిజనులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారీటీలు, అట్టడుగు వర్గాలు, అణగారిన ప్రజలు కలుస్తున్నారు భట్టి విక్రమార్క.
(3 / 8)
మార్చి 16వ తేదీన భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
(4 / 8)
ఇప్నటి వరకు బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్, జనగామ, అలేరు, భువనగిరి, ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్, పరిగి, జడ్చెర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది.
(5 / 8)
భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగిన నియోజకవర్గాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావడంతో పాటు.. కేడర్ లో సరికొత్త జోష్ నెలకొంది. ఇక భట్టి పాదయాత్రకు పార్టీలోని కీలక నేతలు మద్దతు తెలుపుతున్నారు.
(6 / 8)
ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారు.
(7 / 8)
ముగింపు సభకు దాదాపుగా 2 లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు
ఇతర గ్యాలరీలు