సచివాలయాల్లో చేయరు.. మీ సేవల్లో చేయనివ్వరు.. ఏపీ రేషన్‌ కార్డు నిబంధనల్లో కొరవడిన స్పష్టత-confusion over ration card applications denied at secretariats blocked at meeseva ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సచివాలయాల్లో చేయరు.. మీ సేవల్లో చేయనివ్వరు.. ఏపీ రేషన్‌ కార్డు నిబంధనల్లో కొరవడిన స్పష్టత

సచివాలయాల్లో చేయరు.. మీ సేవల్లో చేయనివ్వరు.. ఏపీ రేషన్‌ కార్డు నిబంధనల్లో కొరవడిన స్పష్టత

Published May 21, 2025 12:56 PM IST Sarath Chandra.B
Published May 21, 2025 12:56 PM IST

ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ లబ్దిదారులు తిరగాల్సి వస్తోంది. వాట్సాప్‌ మనమిత్రలో కూడా దరఖాస్తు చేేసే సదుపాయం కల్పిస్తామన్నా సాంకేతిక సమస్యలు తప్పడం లేదు.

ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మొదలైనా సాంకేతిక సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి.

(1 / 6)

కొత్త రేషన్‌ కార్డులను జారీ చేస్తున్నట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్‌ కార్డుల్ని జారీ చేస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో అర్హులైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు వారిని వేధిస్తున్నాయి.

(2 / 6)

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

(3 / 6)

రేషన్ కార్డుల జారీలో సాంకేతికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో మాత్రమే కొత్త కార్డుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. సర్వర్లలో తరచూ సమస్యలు తలెత్తడంతో  దరఖాస్తు చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

(4 / 6)

రేషన్‌ కార్డుల దరఖాస్తు చేయడానికి మీసేవా, ఈసేవ కేంద్రాలకు అవకాశం లేకపోవడం ఇబ్బందిగా మారింది. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులోక లేకపోవడంతో ప్రజలు వాటి చుట్టూ తిరగాల్సి వస్తోంది.

(5 / 6)

ఏపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రతిపాదిక చేయడంతో  ఏదో రూపంలో వాటిని పొందే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఏపీలో రేషన్‌ కార్డులు లేని వారి సంఖ్య 20-30లక్షల్లోపు మాత్రమే ఉంది.  అనర్హులు కూడా  వివిధ మార్గాల్లో రేషన్ కార్డుల్ని పొందేందుకు ప్రస్తుత నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో  సరైన పర్యవేక్షణ లేక పోవడంతో ఇబ్బడిముబ్బడిగా రేషన్‌ కార్డుల్ని మంజూరు చేస్తున్నారు.

(6 / 6)

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

ఇతర గ్యాలరీలు