తెలుగు న్యూస్ / ఫోటో /
AP Rains Update: ముంచుకొస్తున్న అల్పపీడనం, పంటనష్టంపై ఆందోళన, కోస్తా, సీమ జిల్లాలకు అలర్ట్
- AP Rains Update: నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో బుధ, గురు వారాల్లో కోస్తాంధ్ర,రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
అల్పపీడనంతో వర్షాలు కురవనున్న నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలని కోరారు. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేసారు.
(2 / 5)
13 నవంబర్, బుధవారం: బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 5)
14 నవంబర్, గురువారం ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
(4 / 5)
ఖరీఫ్ పంటలు చేతికి అందే సమయం కావడంతో ఇప్పటికే పలు జిల్లాల్లో పంట కోతలు మొదలయ్యాయి. అల్పపీడన ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళన రైతుల్లో ఉంది.
ఇతర గ్యాలరీలు