
(1 / 5)
ఐఎండీ హైదరాబాద్ ప్రకారం.. నగరంలో ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత ఉంటుందని అంచనా ఐఎండీ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉంది.
(istockphoto)
(2 / 5)
తెలంగాణలోని దక్షిణ, తూర్పు జిల్లాలు.. అంటే ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉండే అవకాశం లేదు.
(istockphoto)
(3 / 5)
వాతావరణ శాఖ ప్రకారం.. జనవరి 8 వరకు ఉష్ణోగ్రతలు 11 - 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో చలి ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10.6 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
(istockphoto)
(4 / 5)
బహదూర్‌పురా, షేక్‌పేట, ముషీరాబాద్, మారేడ్‌పల్లి, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బండ్లగూడ వంటి ఇతర ప్రాంతాలలో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత తగ్గుదలతో పాటు.. జనవరి 8 వరకు హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
(istockphoto)
(5 / 5)
నగరంలోని ఆరు జోన్లు.. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు లేదా మబ్బుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ అంచనాల దృష్ట్యా.. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల ప్రజలు రాబోయే రోజుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
(istockphoto)ఇతర గ్యాలరీలు