AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..-cold wave grips telugu states orange alert for several districts in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్..

Jan 22, 2025, 08:06 AM IST Bolleddu Sarath Chandra
Jan 22, 2025, 08:06 AM , IST

  • AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. తెలంగాణలో  4 జిల్లాలకు నేడు,రేపు  'ఆరెంజ్' అలర్ట్‌ జారీ చేశారు. బుధ, గురువా రాల్లో కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా  నమోదయ్యే అవకాశాలున్నాయి. ఏపీలోని పాడేరు, పార్వతీపురం మన్యం, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దేశ వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. 

(1 / 10)

దేశంలోని పలు ప్రాంతాల్లో పగటి పూట కూడా మంచుతెరలు వీడటం లేదు. దీంతో దృశ్య గోచరత లేక వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.  

(2 / 10)

(Hindustan Times)

తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు  పడిపోవడంతో నాలుగు జిల్లాలకు నేడు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. 

(3 / 10)

ఉత్తర భారతదేశంలో మంచు తీవ్రత అధికంగా ఉండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

(4 / 10)

ఉత్తర భారతదేశంలో మంచు తీవ్రత అధికంగా ఉండటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 

(Hindustan Times)

తెలంగాణలో నేడు, రేపు చలి తీవ్రత అధికం కానుంది.  ఐఎండి  4 జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేసింది.  బుధ, గురువా రాల్లో కొన్ని జిల్లాల్లో చలి తీవ్రత నమోదయ్యే అవకా శాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

(5 / 10)

తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని.. 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నాలుగు జిల్లాలకు 'ఆరెంజ్' రంగు హెచ్చరికలు జారీ చేసింది. 

(6 / 10)

బుధ, గురు వారాల్లో హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరి సిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరం గల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 15 డిగ్రీలలోపు నమోదవుతాయని వివరించింది. ఈ జిల్లాలకు 'పసుపు' రంగు హెచ్చరికలు జారీ చేసింది. 

(7 / 10)

ఢిల్లీ కర్తవ్య పథ్‌లో చలిగాలుల నడుమ రిపబ్లిక్ డే రిహార్సల్స్‌ చేస్తున్న సాయుధ బలగాలు

(8 / 10)

(RAJ K RAJ /HT PHOTO)

సోమవారం రాత్రి తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 6. డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్లో 6. 3, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 7.6 డిగ్రీలు నమో దైంది. ఏడు జిల్లాల్లోని చాలా మండలాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

(9 / 10)

ఏపీలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తరాంధ్రలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. 

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు