(1 / 6)
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటున్నాయి.
(unsplash.com)(2 / 6)
తెలంగాణలో చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
(Twitter)(3 / 6)
తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉండనుంది.
(unsplash.com)(4 / 6)
హైదరాబాద్ నగరంలో చూస్తే… శనివారం ఉదయం వేళ పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. తూర్పు, ఆగ్నేయం దిశ నుంచి గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(unsplash.com)(5 / 6)
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(unsplash.com)ఇతర గ్యాలరీలు