తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా..! ఈ 2 రోజుల పాటు శీతలగాలులు, ఎల్లో హెచ్చరికలు జారీ
- తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. శీతల గాలులతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. తెలంగాణలో ఈ రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. శీతల గాలులతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. తెలంగాణలో ఈ రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 8)
ఏపీ, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. శీతల గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
(2 / 8)
తెలంగాణలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది(Twitter)
(3 / 8)
ఇవాళ(4 జనవరి 2025) తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(4 / 8)
జనవరి 5వ తేదీ ఉదయం 8 తర్వాత నుంచి తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(5 / 8)
హైదరాబాద్ లో చూస్తే ఇవాళ ఉదయం సమయంలో పొగ మంచు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఈశాన్య దిశలో గంటకు 04- 08 కమి వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. (PTI)
(6 / 8)
ఆంధ్రప్రదే, యనాంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(7 / 8)
రాయలసీమ జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది(HT Photo/Sakib Ali)
ఇతర గ్యాలరీలు