తెలుగు న్యూస్ / ఫోటో /
TG Gram Panchayat Employees : గ్రామ పంచాయతీల సిబ్బందికి శుభవార్త - ఇకపై గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు
- TG Gram Panchayat Employees Salaries: గ్రీన్ ఛానెల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలా ఎప్పటికప్పుడు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు గ్రామస్థాయి ఉద్యోగులకూ జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు.

(1 / 6)
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను ఇచ్చారు. గ్రీన్ ఛానెల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
(2 / 6)
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
(3 / 6)
గురువారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను కూడా తొందరగా చెల్లించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
(4 / 6)
గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని అధికారులు వివరించగా, వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని చెప్పారు.
(5 / 6)
కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఇతర గ్యాలరీలు