Telangana Govt : గుడ్ న్యూస్... గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ - తాజా ఆదేశాలివే
- గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి,నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అధికారులతో సమీక్షించిన ఆయన..ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందిచాలన్నారు.
- గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి,నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అధికారులతో సమీక్షించిన ఆయన..ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందిచాలన్నారు.
(1 / 6)
హైదరాబాద్ తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, ఆ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
(2 / 6)
గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
(3 / 6)
విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వద్దని హెచ్చరించారు. జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా ఉత్సవాలు, నిమజ్జనం కొనసాగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
(4 / 6)
ఔటర్ రింగు రోడ్డు పరిధిలో గతేడాది 1.50 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారనే లెక్కలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు.
(5 / 6)
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనం కోసమే అనుమతి చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
(6 / 6)
గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు చేప్టటిన సమావేశాలు, ఉత్సవ సమితి సభ్యులు చేసిన సూచనలు, పరిష్కరించిన సమస్యల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మొత్తంగా 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇతర గ్యాలరీలు