తెలుగు న్యూస్ / ఫోటో /
CM Revanth Reddy : మార్చి 31లోగా గ్రూప్-1 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు 20 మంది ఎంపికయ్యారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. మార్చి 31 లోగా గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేస్తామన్నారు.
(1 / 6)
తెలంగాణ యువతకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
(2 / 6)
తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు 20 మంది ఎంపికయ్యారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సింగరేణి సౌజన్యంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు.
(3 / 6)
సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కాదని, ప్రోత్సాహకంగా భావించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
(4 / 6)
గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు.
(5 / 6)
ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఏర్పడిన 14 ఏళ్లుగా గ్రూప్ 1 నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అడ్డంకులు, కుట్రలను అధిగమించి 563 గ్రూప్-1 పోస్టులకు పరీక్షలు నిర్వహించామన్నారు. వచ్చే మార్చి 31 లోగా గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయబోతున్నామని చెప్పారు.
(6 / 6)
సింగరేణి సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రతి కార్మికుడికి రూ.1.25 కోట్ల ప్రమాద బీమా భద్రత కల్పించడానికి సంబంధించి సింగరేణి సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో సింగరేణి ఛైర్మన్, సీఎండీ బలరాం నాయక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
ఇతర గ్యాలరీలు