Hyderabad : హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము .. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్-cm kcr receives president draupadi murmu at hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cm Kcr Receives President Draupadi Murmu At Hyderabad

Hyderabad : హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము .. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

Jun 17, 2023, 06:47 AM IST Maheshwaram Mahendra Chary
Jun 17, 2023, 06:47 AM , IST

  • President Murmu Hyderabad Tour: దేశ రాష్ట్రపతి దౌప్రది ముర్ము శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

శనివారం జరగనున్న కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు. 

(1 / 5)

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. 

(2 / 5)

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లారెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, వెంకటేశ్‌ నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, మేయర్‌ గద్వాల్‌ విజయ లక్ష్మి… రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

(3 / 5)

మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను, అధికారులను రాష్ట్రపతికి సీఎం పరిచయం చేశారు.

(4 / 5)

రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకొని అక్కడే బస చేశారు. శనివారం దుండిగల్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించే సీజీపీకి రీవ్యూయింగ్‌ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరవుతారు. పరేడ్‌ అనంతరం నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు