Nara Rammurthy Naidu:సోదరుడి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు, రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు-cm chandrababu pay tribute to brother nara rammurthy naidu final rites at naravaripalle ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nara Rammurthy Naidu:సోదరుడి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు, రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు

Nara Rammurthy Naidu:సోదరుడి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు, రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు

Updated Nov 16, 2024 07:57 PM IST Bandaru Satyaprasad
Updated Nov 16, 2024 07:57 PM IST

Nara Rammurthy Naidu : హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. తమ్ముడి కుమారులు రోహిత్, గిరీష్‌ను ఓదార్చారు. రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సీఎం చంద్రబాబు సోదరుడు, సినీ హీరో నారా రోహిత్‌ తండ్రి రామ్మూర్తి నాయుడు(72) శనివారం హైదరాబాద్ లో మరణించారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారుడు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. 1994లో టీడీపీ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

(1 / 6)

మాజీ శాసనసభ్యులు, పారిశ్రామికవేత్త నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. 

(2 / 6)

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.  తమ్ముడి కుమారులు రోహిత్, గిరీష్‌ను ఓదార్చారు. 

(3 / 6)

ఆదివారం ఉదయం 7 గంటలకు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించనున్నారు. అనంతరం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

(4 / 6)

‘‘నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

(5 / 6)

సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానన్నారు. రామ్మూర్తి నాయుడి కుమారుడు నారా రోహిత్ కు, ఆయన కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు