
(1 / 6)
నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు మొదటి సంతకం చేశారు.

(2 / 6)
సీఎం చంద్రబాబు తాజా నిర్ణయంతో 1,600 మంది పేదలకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారు. మొత్తం 7,523 మందికి లబ్ది చేకూరింది.

(3 / 6)
ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. మొత్తం 9,123 మంది మొత్తంమ్మీద ప్రయోజనం పొందినట్లయ్యింది.

(4 / 6)
సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య చికిత్సల అత్యవసరాలకు ఆర్థిక సాయం చేస్తారు. దీంతో పాటు పేద కుటుంబాలకు తక్షణ సాయం, ఇతర అత్యవసర అవసరాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తారు.

(5 / 6)
సీఎం చంద్రబాబు నూతన సంవత్సర తొలి సంతకంతో ప్రజలకు మరోసారి సంక్షేమ ప్రభుత్వం భావాన్ని తెలిపిందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

(6 / 6)
సీఎంఆర్ఎఫ్ కింద గత ఏడాది నుంచే పేదలకు తక్షణ పరిష్కారాలు అందించడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తుందని సీఎం కార్యాలయం తెలిపింది.
ఇతర గ్యాలరీలు