
(1 / 7)
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఊబర్ లాంటి ప్రత్యేకమైన యాప్ తీసుకువచ్చే దిశగా కార్యాచరణను సిద్ధం చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రత్యేక యాప్ ద్వారా ఆటో కిరాయి వచ్చేలా చేస్తామన్నారు.

(2 / 7)
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి... ఈ ప్రకటన చేశారు.

(3 / 7)
ఆటోలపై జరిమానాల భారం తగ్గిస్తామని కూడా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం చేసే మంచి పనిని డ్రైవర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్కీమ్ ప్రారంభం సందర్భంగా క్యాంప్ ఆఫీసు నుంచి సభా ప్రాంగణం వరకు 14 కిలోమీటర్ల దూరం ఆటోలోనే సీఎం చంద్రబాబు ప్రయాణించారు.

(4 / 7)
కిరాయి కోసం ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం" అని ముఖ్యమంత్రి చెప్పారు.

(5 / 7)
"యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి... ఆటో డ్రైవర్ల భవిష్యత్తును మరింత మంచిగా తీర్చిదిద్దేలా పనిచేస్తాం" అని సీఎం వివరించారు.

(6 / 7)
ఈ స్కీమ్ కింద 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా రిపోర్టు చేస్తే ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తామని స్పష్టం చేశారు.

(7 / 7)
ఇతర గ్యాలరీలు