(1 / 8)
కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మ వారి జాతర సందర్భంగా గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం,టిటిడి తరఫున అమ్మ వారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.
(2 / 8)
గంగమ్మ జాతరలో విశ్వరూప దర్శనమిస్తున్న కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
(3 / 8)
జాతర కు వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు టీటీడీ తరపున గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్ధప్రసాదాలు అందించారు.
(4 / 8)
కుప్పంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మ వారి విశ్వరూప దర్శనంతో చల్లని తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండేలా అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం
(5 / 8)
ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే గంగమ్మ విశ్వరూప దర్శనాన్ని చేసుకుని, రాష్ట్రాన్ని గంగమ్మ చల్లంగా చూడాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కుప్పం ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన అభివృద్దిపనులు అన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా, ప్రజలకు అభివృద్ది ఫలాలు లభించేలా కరుణించాలని ప్రార్థించినట్లు సిఎం తెలిపారు.
(6 / 8)
ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం,ఆలయ చైర్మన్ రవిచంద్రబాబు స్వాగతం పలికారు.
(7 / 8)
కుప్పంలో జరిగిన గంగమాంబ జాతరలో అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(8 / 8)
బుధవారం మధ్యాహ్నం తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర కోసంకుప్పం వచ్చిన ముఖ్యమంత్రి దంపతులు అమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
ఇతర గ్యాలరీలు