CJI Visits Tirumala : తిరుమలలో పురాతన తాళపత్ర గ్రంథాలను సందర్శించిన సీజేఐ - ఇవిగో ఫొటోలు-cji dr yv chandrachud visits palm leaf manuscripts library at svv university ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cji Visits Tirumala : తిరుమలలో పురాతన తాళపత్ర గ్రంథాలను సందర్శించిన సీజేఐ - ఇవిగో ఫొటోలు

CJI Visits Tirumala : తిరుమలలో పురాతన తాళపత్ర గ్రంథాలను సందర్శించిన సీజేఐ - ఇవిగో ఫొటోలు

Published Mar 27, 2024 05:18 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 27, 2024 05:18 PM IST

  • CJI YV Chandrachud Visits Tirumala : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బుధవారం తిరుమలను సందర్శించారు. ఇందులో భాగంగా ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో తాళపత్రాలను సంద‌ర్శించారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి…..

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో తాళపత్రాలను  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ సందర్శించారు.

(1 / 6)

కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, రుషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరచిన రాత ప్రతులను ( మాన్యు స్క్రిప్ట్స్) భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అన్నారు.

(2 / 6)

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ మరియు వేద విశ్వవిద్యాలయంచే సంరక్షిస్తూ డిటిలైజేషన్ చేస్తున్న తాళపత్రాలను బుధవారం సీజేఐ సందర్శించారు.

(3 / 6)

ముందుగా విశ్వవిద్యాలయంచే సంరక్షింపబడుతున్న వేద, వేదాంగా, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ మరియు దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను మరియు వాటి ప్రచురణను ఆయ‌న ప‌రిశీలించారు.

(4 / 6)

అనంతరం ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షించబడుతున్నాయ‌న్నారు. ఇక్క‌డ ఉన్న పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకున్న‌ట్లు చెప్పారు. ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది, న్యాయ విద్య‌ను ఎలా అభ్య‌సించేవారు, పురాతన న్యాయ శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివ‌రించిన‌ట్లు తెలిపారు.

(5 / 6)

ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశ వ్యాప్తంగా చేయాల‌న్నారు. ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ, పరిశోధన, ప్రచురణ యొక్క ఫలితాలు కేవలం భారత దేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయ‌ని నేను దృఢంగా నమ్ముతున్నాని చెప్పారు. టీటీడీ ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపటం, అందులో మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిదని, వేదమంత్ర పఠనం వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంద‌ని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు