Coldplay Concert: అహ్మదాబాద్‌ను ఊపేసిన కోల్డ్‌ప్లే కాన్సర్ట్.. ఇండియాలో నయా రికార్డు.. ఆడియెన్స్‌లో బుమ్రా కూడా..
- Coldplay Concert: కోల్డ్‌ప్లే కాన్సర్ట్ అహ్మదాబాద్ ను ఊపేసింది. ఇండియాలో ఈ కాన్సర్ట్ తో కోల్డ్‌ప్లే టూర్ ముగిసింది. ఈ చివరి కాన్సర్ట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ లో బుమ్రా కూడా ఉండటం విశేషం.
- Coldplay Concert: కోల్డ్‌ప్లే కాన్సర్ట్ అహ్మదాబాద్ ను ఊపేసింది. ఇండియాలో ఈ కాన్సర్ట్ తో కోల్డ్‌ప్లే టూర్ ముగిసింది. ఈ చివరి కాన్సర్ట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ లో బుమ్రా కూడా ఉండటం విశేషం.
(1 / 8)
Coldplay Concert: కోల్డ్‌ప్లే అహ్మదాబాద్ కాన్సర్ట్ ఆదివారం (జనవరి 26) రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఇందులో ఈ బ్యాండ్ లీడ్ క్రిస్ మార్టిన్ ఇండియా 76వ రిపబ్లిక్ డే సందర్భంగా వందేమాతరం, మా తుఝే సలాంలాంటి పాటలతో ఉర్రూతలూగించాడు.
(2 / 8)
Coldplay Concert: కోల్డ్‌ప్లే కాన్సర్ట్ చూడటానికి వచ్చిన టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను క్రిస్ మార్టిన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “ఓ జస్‌ప్రీత్ బుమ్రా, మై బ్రదర్. క్రికెట్ లో బెస్ట్ బౌలర్. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చడాన్ని మేము ఎంజాయ్ చేయలేదు” అని మార్టిన్ అనడం విశేషం.
(3 / 8)
Coldplay Concert: అహ్మదాబాద్ కాన్సర్ట్ లో భాగంగా క్రిస్ మార్టిన్ ఏలియన్ మాస్క్ వేసుకోవడం విశేషం.
(4 / 8)
Coldplay Concert: ముంబై కాన్సర్ట్ లాగే అహ్మదాబాద్ లోనూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు ఓ పాటను అతడు అంకితమిచ్చాడు.
(5 / 8)
Coldplay Concert: ఇండియాలో అతిపెద్ద కాన్సర్ట్ గా ఈ కోల్డ్‌ప్లే అహ్మదాబాద్ కాన్సర్ట్ నిలిచింది. ఏకంగా 1.34 లక్షల మంది ప్రేక్షకులు ఈ కాన్సర్ట్ చూడటం విశేషం.
(6 / 8)
Coldplay Concert: అహ్మదాబాద్ కాన్సర్ట్ సందర్భంగా జస్‌ప్రీత్ బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్న వీడియోతోపాటు అతని సంతకం ఉన్న టెస్ట్ జెర్సీని కూడా ఈ సందర్భంగా క్రిస్ మార్టిన్ స్టేజ్ పై చూపించాడు.
(7 / 8)
Coldplay Concert: ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన ఈ కాన్సర్ట్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
ఇతర గ్యాలరీలు