Sankrathi Festival: ఈ సంక్రాంతికి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోవాలంటే ఈ రంగు చీరలను ఎంచుకోండి!-choose these colorful sarees for a traditional and stunning look on this sankranti festival ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sankrathi Festival: ఈ సంక్రాంతికి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోవాలంటే ఈ రంగు చీరలను ఎంచుకోండి!

Sankrathi Festival: ఈ సంక్రాంతికి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోవాలంటే ఈ రంగు చీరలను ఎంచుకోండి!

Jan 10, 2025, 08:00 AM IST Ramya Sri Marka
Jan 10, 2025, 08:00 AM , IST

  • Sankrathi Festival: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మరి పండుగ రోజున సంప్రదాయ దుస్తుల్లో తళుకుమనాలంటే ఏ రంగు చీర కట్టుకోవాలో తేల్చుకున్నారా? ఇంకా ఏమీ తేల్చుకోలేకపోతే ఇక్కడ కొన్ని రంగులు ఉన్నాయి. ఇవి పండుగ రోజున మీరు ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయేలా చేస్తాయి.

పండుగ ఏదైనా సరే పచ్చ రంగులేనిదే సంపూర్ణంగా అనిపించదు. ఈ సంక్రాంతి పండుగను మీరు పల్లెటూర్లో చేసుకుంటున్నట్లయితే ఇలా ముదురు ఆకుపచ్చ రంగు చీర, మెరూన్ రంగు జాకెట్ వేసుకొండి. చూసిన వాళ్లంతా కుళ్లుకోవాల్సిందే.

(1 / 7)

పసుపు లేకుండా ఏ సంప్రదాయం పూర్తి కాదు. ఈ సంక్రాంతికి మీరు ట్రెడిషనల్ లుక్‌లో కనిపించాలంటే పసుపు రంగు చీరను ధరించండి.  దీనికి తగిన జాకెట్ వేసుకున్నారంటే కుందనపు బొమ్మలా కనిపిస్తారు.

(2 / 7)

ట్రెడిషనల్‌గా కనిపించాలి, అలాగే సింపుల్‌గా అనిపించాలి అంటే మీరు క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చీరను ఎంచుకోవచ్చు. ఇది మీకు పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్‌ని ఇస్తుంది.  

(3 / 7)

ఎరుపు రంగు అంటే శుభానికి, ధైర్యానికి ప్రతీక. సంక్రాంతి పండుగ రోజున ఎరుపు రంగు చీరను ధరించారంటే తెలుగుదనం, పండుగ వాతావరణం అన్నీ మీలోనే ఉట్టిపడతాయి. మంచి ట్రెడిషనల్ లుక్‌కి ఎరుపు రంగు కేరాఫ్ అడ్రస్. 

(4 / 7)

(Pinterest)

పండుగలు, ప్రత్యేక రోజుల్లో సంప్రదాయబద్దంగా కనిపించాలంటే గంధం రంగు, గోధుమ రంగు, బ్రౌన్ రంగులు మంచి ఎంపిక. ఇవి చాలా ప్రత్యేకంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి.  

(5 / 7)

పండుగ రోజున ఎవరైనా నిండుగా కనిపించాలని కోరుకుంటారు. మీరు అలాగే ఉండాలనుకుంటే మీకు వంకాయ రంగు, గులాబీ రంగు, పచ్చ రంగులు మంచి ఛాయిస్ ఇవి చాలా నిండుగా, సంప్రదాయం ఉట్టిపడేలా కనిపిస్తాయి.

(6 / 7)

పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌గా ట్రెడిషనల్‌గా కనిపించాలనుకునే వారు పర్పిల్, లేత ఆకుపచ్చ, క్రీమ్ వంటి లైట్ రంగులను ఎంచుకోవచ్చు. ఇవి సింపుల్ గా కనిపించినా సంప్రదాయాన్ని కచ్చితంగా కాపాడతాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు