(1 / 5)
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్, ప్రముఖ హీరో చిరంజీవి కలిశారు. ఇటీవలే సీఎం పదవిని చేపట్టిన రేవంత్‍కు శుభాకాంక్షలు తెలిపారు.
(2 / 5)
హైదరాబాద్‍లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి నేడు ఆయనను కలిశారు చిరంజీవి. రేవంత్‍కు పుష్పగుచ్చం అందించి, శాలువా వేసి అభినందించారు. ఇద్దరూ నవ్వుతూ ముచ్చటించుకున్నారు.
(3 / 5)
సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి కాసేపు భేటీ అయ్యారు. సినిమాలు, రాజకీయాలు సహా మరిన్ని విషయాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
(4 / 5)
నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండగా.. ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా లేరు. సినిమాలపైనే పూర్తి దృష్టి సారించారు.
(5 / 5)
సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి తదుపరి ఓ సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇది చిరంజీవికి 156వ చిత్రంగా ఉంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‍లో చిరూ పాల్గొననున్నారు.
ఇతర గ్యాలరీలు