(1 / 5)
బాలీవుడ్‌లో హీరోగా చిరంజీవి మూడు సినిమాలు చేశాడు. అయితే ఈ మూడు హిందీ మూవీస్ రీమేక్ కథలతోనే తెరకెక్కడం గమనార్హం. .
(2 / 5)
రాజశేఖర్ అంకుశం సినిమాను చిరంజీవి హిందీలో ప్రతిబంధ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌కు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. జూహీ చావ్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సక్సెస్ అయ్యింది.
(3 / 5)
తాను హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో ఆజ్ కా గూండా రాజ్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు. ఆజ్ కా గూండారాజ్‌లో మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
(4 / 5)
శంకర్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ జెంటిల్‌మెన్‌ను చిరంజీవి ది జెంటిల్‌మెన్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు. తమిళంలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ బాలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్ అయ్యింది.
(5 / 5)
తమిళంలో 47 డేస్ నాట్కల్‌తో పాటు మరో మూవీలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్స్‌లో చిరంజీవి కనిపించాడు.కన్నడంలో సిపాయి, శ్రీ మంజునాథ సినిమాలు చేశాడు.
ఇతర గ్యాలరీలు