(1 / 5)
మెగాస్టార్ చిరంజీవి నయా సినిమా లాంచ్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఈ ఏడాది బ్లాక్‍బస్టర్ సాధించిన అనిల్ రావిపూడితో చిరూ ఈ మూవీ చేస్తున్నారు. ఉగాది పర్వదినమైన నేడు (మార్చి 30) ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
(2 / 5)
అనిల్‍తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి భారీ సక్సెస్ సాధించిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్.. మెగా157 (ప్రాజెక్ట్ టైటిల్) మూవీ లాంచ్ ఈవెంట్‍కు అతిథిగా వచ్చారు. క్లాప్ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్‍కు వెంకీ స్పెషల్ అట్రాక్షన్‍గా నిలిచారు.
(3 / 5)
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు మెగా157 ప్రాజెక్టు తొలి షాట్‍కు డైరెక్షన్ చేశారు. ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావ అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్టు పేపర్లను దర్శకుడు అనిల్‍కు పాపులర్ ప్రొడ్యూజర్లు దిల్‍రాజు, శిరీష్ అందించారు.
(4 / 5)
మెగా157 పూజా కార్యక్రమానికి డైరెక్టర్లు బాబీ, శ్రీకాంత్ ఓదెల, వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యారు. శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రానికి కూడా చిరూ ఓకే చెప్పారు. బాబీతో గతంలో వాల్తేరు వీరయ్య మూవీ చేశారు చిరూ.
(5 / 5)
మెగా157 చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. ఈ మూవీలో వింటేజ్ చిరూని చూస్తారని అనిల్ ఇటీవలే చెప్పారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు.
ఇతర గ్యాలరీలు