
(1 / 7)
తెలుగు బుల్లితెర సీరియల్స్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ముద్దుగుమ్మల్లో కావ్యశ్రీ ఒకరు. 2025లో ప్రసారం అవుతోన్న చిన్ని సీరియల్‌లో హీరోయిన్‌గా నటించి అందరి మెప్పు పొందింది కావ్య.

(2 / 7)
2019లో తెలుగు బుల్లితెరపైకి గోరింటాకు సీరియల్‌తో అడుగుపెట్టింది కావ్యశ్రీ. ఆ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మా, గువ్వ గోరింక, చిన్ని వంటి సీరియల్స్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.

(3 / 7)
గోరింటాకు సీరియల్‌లో కో స్టార్, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ విన్నర్ అయిన నిఖిల్ మాలియక్కల్‌తో కావ్యశ్రీ కొంతకాలం ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. నిఖిల్ బిగ్ బాస్ ఎంట్రీకి ముందు కావ్యతో బ్రేకప్ అయినట్లు హౌజ్‌లో పలు సందర్భాల్లో చెప్పాడు మాలియక్కల్.

(4 / 7)
ఇటీవల టీవీ షో సర్కార్‌లో హోస్ట్ సుడిగాలి సుధీర్‌తో కలిసి కావ్య శ్రీ డ్యాన్స్ చేసింది. సుధీర్, కావ్య శ్రీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది కావ్యశ్రీ.

(5 / 7)
ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి అడుగుపెట్టనుంది కావ్య శ్రీ. బిగ్ బాస్ 9 తెలుగులో కంటెస్టెంట్‌గా ఈ సీరియల్ ముద్దుగుమ్మ కావ్య శ్రీ 99 శాతం కన్ఫర్మ్ అయిందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

(6 / 7)
అయితే, ప్రతి బిగ్ బాస్ సీజన్‌లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అదే తరహాలో పలువురితోపాటు కావ్య శ్రీ కూడా బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌లోకి అడుగుపెట్టనుంది.

(7 / 7)
అయితే, ఈ సారి వైల్డ్‌గా కాకుండా రాయల్ కార్డ్స్‌గా కంటెస్టెంట్స్‌ను ప్రవేశపెట్టనున్నారు బిగ్ బాస్ టీమ్. ఇందులో భాగంగానే కావ్య శ్రీ రాయల్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 9 తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇతర గ్యాలరీలు