Chinna OTT Release: సిద్ధార్థ్ ఎమోషనల్ సినిమా ‘చిన్నా’ ఏ ఓటీటీలోకి.. ఎప్పుడు స్ట్రీమింగ్‍కు రానుందంటే!
Chinna OTT Release: సిద్ధార్థ్ హీరోగా నటించిన చిత్తా సినిమా తెలుగులో చిన్నా పేరుతో వచ్చింది. ఎమోషనల్ థ్రిల్లర్ మూవీగా వచ్చినా చిన్నా సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఏ ఓటీటీలోకి ఎప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 5)
చిత్తా సినిమా తమిళంలో సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది. అక్కడ సూపర్ హిట్ కావటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. ఈ మూవీ తెలుగులో ‘చిన్నా’ పేరు అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తోంది.
(2 / 5)
చిన్నా మూవీ నవంబర్ 17వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.
(3 / 5)
చిన్నా సినిమా తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషల్లోనూ నవంబర్ 17న స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ విషయంపై డిస్నీ+ హాట్‍స్టార్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది.
(4 / 5)
చిన్నా సినిమా ఎమోషనల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. ఈశ్వర్ అలియాజ్ చిన్నా (సిద్ధార్థ్) అన్న కూతురు చిట్టి ఓ రోజు మిస్ అవుతుంది. దీంతో చిన్నాపై ఆరోపణలు వస్తాయి. అసలు నిజమేంటి? చిట్టిని ఈశ్వర్ కనిపెట్టారా? అతడు కనుగొన్న రహస్యాలు ఏంటి? అనేదే ఈ చిత్రం ప్రధాన కథగా ఉంది.
ఇతర గ్యాలరీలు