తెలుగు న్యూస్ / ఫోటో /
Chilli Storage Tips: పచ్చి మిరపకాయలను ఎక్కువ కాలం నిల్వచేసేందుకు సింపుల్ టిప్స్!
- Green Chilli Storage Tips: వర్షాకాలంలో త్వరగా పాడయ్యే వాటిలో పచ్చిమిర్చి కూడా ఒకటి. అయితే వీటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచటానికి చిట్కాలను చూడండి.
- Green Chilli Storage Tips: వర్షాకాలంలో త్వరగా పాడయ్యే వాటిలో పచ్చిమిర్చి కూడా ఒకటి. అయితే వీటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచటానికి చిట్కాలను చూడండి.
(1 / 5)
వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం కారణంగా కూరగాయలు త్వరగా పాడవుతాయి. ఇందులో పచ్చిమిర్చి కొద్ది రోజుల్లోనే కుళ్లిపోతుంది. పచ్చి మిరపకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.
(2 / 5)
పచ్చిమిర్చిని చల్లటి నీటిలో బాగా కడగాలి. ఆపై టిష్యూ పేపర్‌తో తుడిచి, బహిరంగ ప్రదేశంలో లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టండి. తర్వాత కాడలను తీసివేసి గాలి చొరబడని కంటైనర్‌లో వేసి, ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే గుడ్డలో చుట్టి పెట్టవచ్చు.
(3 / 5)
ప్లాస్టిక్ కంటైనర్‌లో మిరపకాయలను ఉంచేటప్పుడు, ముందుగా దానిలో టిష్యూ పేపర్‌ను ఉంచండి. అప్పుడు మిరపకాయలను ఉంచండి . అందులో తడి ఉంటే పేపర్ లాగేస్తుంది. ఎందుకంటే తడి వల్ల మిరపకాయలు త్వరగా కుళ్లిపోతాయి.
(5 / 5)
వంటలో కారం పొడికి బదులు పచ్చి మిరపకాయలను ఉపయోగించేందుకు ప్రయత్నించండి. పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరం ఇతర విటమిన్లను గ్రహించడంలో సహాయపడుతుంది, చర్మానికి మేలు చేస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పచ్చిమిర్చిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ ఎ కళ్లకు మేలు చేస్తుంది. పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని బ్యాక్టీరియాను తొలగిస్తాయి
ఇతర గ్యాలరీలు