తెలుగు న్యూస్ / ఫోటో /
TG Rythu Bharosa Scheme : రైతు భరోసాపై కీలక అప్డేట్ - పంట వేసినా, వేయకున్నా స్కీమ్ వర్తింపు..! ఆ ఒక్కటి తప్పనిసరి
- Telangana Rythu Bharosa Scheme Updates : రైతు భరోసా స్కీమ్ పై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు పంట వేసినా.. వేయకున్నా యోగ్యతనే ప్రామాణికంగా తీసుకుని పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
- Telangana Rythu Bharosa Scheme Updates : రైతు భరోసా స్కీమ్ పై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు పంట వేసినా.. వేయకున్నా యోగ్యతనే ప్రామాణికంగా తీసుకుని పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
(1 / 7)
తెలంగాణ రైతులకు మరో కీలక అప్డేట్ వచ్చేసింది. పంట వేసినా, వేయకున్నా..రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే వ్యవసాయ యోగ్యతి కలిగి ఉండాలని.. అలా ఉన్న ప్రతి ఎకరానికి పంట పెట్టుబడి సాయం అందించాలని స్పష్టం చేశారు.(image source istockphoto.com)
(2 / 7)
గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై చర్చించారు. ఈ సందర్భంగా… రైతు భరోసాపై కీలక ఆదేశాలను జారీ చేశారు. (image source istockphoto.com)
(3 / 7)
రైతు పంట వేసినా.. వేయకున్నా.. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ మండలంలోని ఎమ్మార్వో, ఏఈవో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. (image source istockphoto.com)
(4 / 7)
వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాంటి భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని స్పష్టం చేశారు.(image source istockphoto.com)
(5 / 7)
రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్, మైనింగ్, గోదాములు నిర్మించిన భూములు, ప్రాజెక్టులకు కోసం ప్రభుత్వం భూముల వివరాలను వెంటనే సేకరించాలని సీఎం రేవంత్ ఆదేశంచారు. గ్రామాల మ్యాప్‌లను పరిశీలించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవాలని సూచించారు. (image source istockphoto.com)
(6 / 7)
ఆయా భూములపై గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని స్పష్టం చేశారు.(image source istockphoto.com)
ఇతర గ్యాలరీలు