AP TG Chicken Rates : గుడ్డు ధర పైపైకి…! తగ్గిన చికెన్ ధరలు
- AP Telangana Chicken Prices : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర రూ. 180- 200 మధ్య ఉంది. స్కిన్ తో అయితే 160 -170 మధ్య విక్రయిస్తున్నారు. మరోవైపు కోడిగుడ్డు ధర మాత్రం తగ్గేదేలే అన్నట్లు పైకి వెళ్తోంది. రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది.
- AP Telangana Chicken Prices : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర రూ. 180- 200 మధ్య ఉంది. స్కిన్ తో అయితే 160 -170 మధ్య విక్రయిస్తున్నారు. మరోవైపు కోడిగుడ్డు ధర మాత్రం తగ్గేదేలే అన్నట్లు పైకి వెళ్తోంది. రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది.
(1 / 6)
కార్తీక మాసం నేపథ్యంలో చికెన్ ధరలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా రూ. 200లోపే విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు కోడి గుడ్డు ధర మాత్రం పైపైకి అన్నట్లు వెళ్తోంది.
(image source unsplash.com)(2 / 6)
ఇవాళ(డిసెంబర్ 08) హైదరాబాద్ లో కిలో చికెన్(స్కిల్ లెస్) ధర రూ. 200గా ఉంది. విత్ స్కిన్ తో అయితే 170 - 180 మధ్య విక్రయిస్తున్నారు. అదే కార్తీక మాసం కంటే ముందు చూస్తే… కిలో చికెన్ ధర రూ. 270 నుంచి రూ. 300 మధ్య పలికిన సంగతి తెలిసిందే.
(3 / 6)
కార్తీక మాసం రాకతోనే చికెన్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికే కార్తీక మాసం పూర్తయినప్పటికీ… అదే మాదిరి ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా చికెన్ ధరలు భారీగా తగ్గాయి.
(image source unsplash.com)(4 / 6)
ఇక తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్డు ధర తగ్గేదేలే అన్నట్లు పైపైకి వెళ్తోంది. రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది. హోల్ సేల్‌గా రూ.6.50గా ధర ఉంది. ఇక ఇదే నెలలో కిస్మస్ ఉంటుంది. ఆ వెంటనే న్యూ ఇయర్ వస్తుంది. ఎక్కువగా కేక్ లు విక్రయిస్తుంటారు.
(image source unsplash.com)(5 / 6)
ముందస్తు క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో కేకుల వినియోగం పెరిగింది. కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో ధరలు తగ్గటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న ధరలతో పోల్చితే స్వల్పంగా మరికొంత కూడా పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు.
(image source unsplash.com)(6 / 6)
క్మిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఉన్న నేపథ్యంలో చికెన్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కార్తీక మాసం వచ్చినప్పట్నుంచే ధరలు తగ్గాయని… మరికొద్దిరోజుల్లోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.. జనవరిలో సంక్రాంతి పండుగ కూడా ఉంటుందని.. ఆ సమయానికి మరింత రేట్లు పెరుగొచ్చని అంటున్నారు.
ఇతర గ్యాలరీలు