TG Chicken Prices : శ్రావణంలోనూ తగ్గని చికెన్ ధరలు - ఈ రెండు వారాల్లో ఎంత పెరిగిందంటే..?
- Chicken Prices in Telugu State : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చికెన్ ధరలు పెరిగాయి. శ్రావణ మాసంలో ధరలు మరింత తగ్గుతాయని భావించినప్పటికీ… ధరలు మాత్రం పైకి ఎక్కాయి. హైదరాబాద్ లో శుక్రవారం(ఆగస్టు 30) కేజీ చికెన్ ధర రూ. 220 - 230 మధ్య ఉంది. తాజా రేట్ల వివరాలను ఇక్కడ చూడండి……
- Chicken Prices in Telugu State : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చికెన్ ధరలు పెరిగాయి. శ్రావణ మాసంలో ధరలు మరింత తగ్గుతాయని భావించినప్పటికీ… ధరలు మాత్రం పైకి ఎక్కాయి. హైదరాబాద్ లో శుక్రవారం(ఆగస్టు 30) కేజీ చికెన్ ధర రూ. 220 - 230 మధ్య ఉంది. తాజా రేట్ల వివరాలను ఇక్కడ చూడండి……
(1 / 6)
తెలంగాణ, ఏపీలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆషాడ మాస బోనాల పండగ వరకు కూడా చికెన్ ధరలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏకంగా రూ. 300 వరకు కూడా వెళ్లింది. ఆ తర్వాత శ్రావణ మాసం రావటంతో ధరలు భారీగా పడిపోయాయి.(image source from /unsplash.com)
(2 / 6)
శ్రావణ మాసంలో పూజలు, ఉపావాసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది నాన్ వెజ్ కూ దూరంగా ఉంటారు. దీంతో ధరలు భారీగా పడిపోతాయని అంతా భావించారు. కానీ మొదట్లో ఆ పరిస్థితి కనిపించినప్పటికీ… మళ్లీ ధరలు పైకి లేచాయి. (image source from /unsplash.com)
(3 / 6)
ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. మొదటి పది రోజులపాటు చికెన్ ధరలు పడిపోగా… ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చేశాయి. (image source from /unsplash.com)
(4 / 6)
ఈ ఆగస్టు రెండో వారంలో ధరలు చూస్తే కిలో చికెన్(స్కిన్ లెస్) రూ.190గా ఉంటే… విత్ స్కిన్ రూ. 170 గా ఉంది. కానీ ఇవాళ (ఆగస్టు 30) హైదరాబాద్ లో చూస్తే.. కిలో చికెన్(స్కిన్ లెస్) ధర రూ.230గా ఉంటే… విత్ స్కిన్ రూ. 210గా ఉంది. గత రెండు వారాలుగా ఇవే ధరలు ఉన్నాయి. (image source from /unsplash.com)
(5 / 6)
రాబోయే రోజుల్లో చికెన్ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉందని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రావణ మాసం వచ్చిందంటే చికెన్ ధరలు పడిపోతుంటాయని.. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా అనిపించిందని చెప్పారు.(image source from /unsplash.com)
ఇతర గ్యాలరీలు