Cherlapally Terminal : ఎయిర్ పోర్ట్ తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్- 9 ప్లాట్ ఫామ్ లు, 19 ట్రాక్ లు, ప్రత్యేకతలివే
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. రూ.413 కోట్లతో ఎయిర్ పోర్టు తరహాలో నిర్మించిన ఈ టర్మినల్ కు అనేక ప్రత్యేకలు ఉన్నాయి.
(1 / 7)
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతో రూ.413 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. చర్లపల్లి రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు.
(2 / 7)
చర్లపల్లి రైల్వే టెర్నినల్ ను రూ.413 కోట్ల అంచనా వ్యయంతో పునర్ నిర్మించారు. ఈ కొత్త టెర్మినల్ లో 25 జతల రైళ్లను నిర్వహించవచ్చు. చర్లపల్లి స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. వాహనాల పార్కింగ్ కు విశాలమైన సర్క్యులేటింగ్ ప్రాంతం, ప్రత్యేక బస్ బే ఉన్నాయి. ఈ స్టేషన్ నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కొత్త టెర్మినల్ అత్యాధునిక సౌకర్యాలు, కనెక్టివిటీ, ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యంపై దృష్టి సారించారు.
(3 / 7)
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రూ.413 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు. ఎయిర్‌పోర్టు తరహాలో నూతన టర్మినల్ రూపొందించారు. ఈ స్టేషన్‌లో మొత్తం 19 ట్రాక్స్ ఉన్నాయి. గతంలో 10 ట్రాక్‌లు ఉండగా.. కొత్తగా 9 ట్రాక్ లు నిర్మించారు.
(4 / 7)
చర్లపల్లి స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్ ఫామ్ లు ఏర్పాటు చేశారు. 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఏర్పాటుచేశారు. అన్ని రకాల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, పార్సిల్ బుకింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
(5 / 7)
చర్లపల్లి టెర్మినల్ నుంచి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభినున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. వచ్చే మార్చి నుంచి రైళ్లు ప్రారంభం కానున్నాయని తెలిపింది. అలాగే మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ ఇస్తున్నట్లు పేర్కొంది.
(6 / 7)
చెన్నై సెంట్రల్- హైదరాబాద్- చెన్నై సెంట్రల్...టెర్మినల్‌ను హైదరాబాద్ నుంచి చర్లపల్లికి మార్చారు. ఈ నిర్ణయం మార్చి 7 నుంచి అమల్లోకి రానుంది. గోరఖ్‌పుర్- సికింద్రాబాద్- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్... టెర్మినల్‌ను సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చారు. ఈ నిర్ణయం మార్చి 12 నుంచి అమల్లోకి రానుంది.
(7 / 7)
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే మూడు రైళ్లకు చర్లపల్లి టెర్మినల్‌లో స్టాపేజీ ఇచ్చారు. ఈ నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానుంది. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్(12757), గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17201), సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్(17233) రైళ్లు చర్లపల్లిలో ఆగనున్నాయి.
ఇతర గ్యాలరీలు