
(1 / 5)
వివో వీ60ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 1.07 బిలియన్ కలర్స్‌కి సపోర్ట్ చేస్తుంది.అంతేకాదు ఇందులో డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ సైతం ఉంది. లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది.

(2 / 5)
ఇదొక కెమెరా సెంట్రిక్ ఫోన్ అని చెప్పుకోవాలి! ఇందులో 200ఎంపీ+8ఎంపీ రేర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ఏఐ ఆటో-ఫోకస్ గ్రూప్ సెల్ఫీ కెమెరా సైతం ఇందులో ఉంది.

(3 / 5)
ఏఐ ఆధారిత కెమెరా ఫీచర్స్ కూడా ఈ వివో వీ60ఈలో బోలెడు ఉన్నాయి! ఏఐ ఫెస్టివల్ పోర్ట్రెయిట్, ఏఐ ఫోర్ సీజన్ పోర్ట్రెయిట్, ఇమేజ్ ఎక్స్‌పాండర్ వంటివి కొన్ని. ఇన్ని ఏఐ మోడ్‌లను కలిగి ఉన్న భారతదేశంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే!

(4 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 6500ఎంఏహెచ్ బడా బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్‌లో ఏఐ ఎరేజ్ 3.0, ఏఐ క్యాప్షన్స్, ఏఐ స్మార్ట్ కాల్ అసిస్టెంట్, జెమిని ఇంటిగ్రేషన్ వంటి కొత్త ఏఐ-ఆధారిత ఫీచర్స్ కూడా ఉన్నాయి.

(5 / 5)
వివో వీ60ఈ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. ఇక 12జీబీ + 256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 33,999గా నిర్ణయించారు.
ఇతర గ్యాలరీలు