(1 / 5)
సుజుకీ ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరకు సంబంధించిన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. కాగా ఈ ఈ-స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 1.10లక్షలు- రూ. 1.25లక్షల మధ్యలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
(2 / 5)
సుజుకీ ఈ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.07 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఫుల్‌గా ఛార్జ్ చేసేందుకు 6 గంటల 42 నిమిషాల సమయం పడుతుంది. సింగిల్ ఛార్జ్‌తో ఈ మోడల్ 95 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. సిటీ డ్రైవ్‌కి ఉపయోగించే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని సంస్థ రెడీ చేస్తోంది.
(3 / 5)
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 71 కేఎంపీహెచ్ అని తెలుస్తోంది. ఇందులోని మోటార్ 5.49 బీహెచ్పీ పవర్, 15 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
(4 / 5)
మూడు కలర్ ఆప్షన్స్‌లో ఈ సుజుకీ ఈ యాక్సెస్ అందుబాటులోకి రానుంది. అవి.. పర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మాట్ బోర్డాక్స్ రెడ్, మెటాలిక్ ఫిబ్రాన్ గ్రే.
(5 / 5)
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో డే-నైట్ మోడ్స్‌తో కూడిన టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే, సుజుకీ రైడ్ కనెక్ట్ యాప్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో స్పీడోమీటర్, బ్యాటరీ లెవల్, ఓడోమీటర్, క్లాక్, వోల్టోమీటర్, యావరేజ్- కరెంట్ ఎనర్జీ కన్సమ్షన్, రైడింగ్ మోడ్‌ని చూపిస్తుంది.
ఇతర గ్యాలరీలు