
(1 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎం17 స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేని కలిగి ఉంది. ఈ స్క్రీన్ 1100 నిట్స్ వరకు హెచ్‌బీఎం పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

(2 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్ 6ఎన్ఎం ఎక్సినోస్ 1330 చిప్సెట్తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వరకు వేరియంట్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం17 ఫోన్ One UI 7 అనే ఓఎస్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఏకంగా ఆరు సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని శాంసంగ్ ప్రకటించడం విశేషం!

(3 / 5)
ఇటీవలే లాంచ్ అయిన ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం17 స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అంతేకాదు, దీనికి 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైతం లభిస్తుంది.

(4 / 5)
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో 50ఎంపీ+5ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపీ ఫ్రెంట్ కెమెరాని ఇచ్చింది సంస్థ.

(5 / 5)
శాంసంగ్ గెలాక్సీ ఎం17 సేల్ అక్టోబర్ 13, 2025 నుంచి భారతదేశంలో ప్రారంభమవుతుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఈ గ్యాడ్జెట్‌ని కొనుగోలు చేయవచ్చు. ధరలు ఈ విధంగా ఉన్నాయి.. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 12,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 13,999, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 15,499. ప్రతి వేరియంట్‌పై లాంచ్ ఆఫర్ కింద రూ. 500 తగ్గింపు సైతం లభిస్తోంది.
ఇతర గ్యాలరీలు