(1 / 5)
రివోల్ట్ ఆర్వీ1 ఎలక్ట్రిక్ బైక్‌లో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ (ఈకో మోడ్) వరకు రేంజ్‌ని ఇస్తుంది.
(2 / 5)
ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని 0 నుంచి 8శాతం ఛార్జ్ చేసేందుకు 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో 2.8 కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. మొత్తం మీద ఈ ఈ-బైక్ బరువు 108 కేజీలు. 250 కేజీల వరకు బరువును మోయగలదు.
(3 / 5)
ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, ఇంండికేటర్స్ అండ్ లైసెన్స్ ప్లేట్ లైట్ వంటి లైటింగ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. బ్లాక్ నియాన్ గ్రీన్, బ్లాక్ నియాన్ బ్లూ, కాస్మిక్ బ్లాక్ రెడ్, టైటాన్ రెడ్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్స్‌లో ఈ మోడల్ లభిస్తుంది.
(4 / 5)
రివోల్ట్ ఆర్వీ1 ఎలక్ట్రిక్ బైక్‌పై 5ఏళ్లు లేదా 75వేల కి.మీల ప్రాడక్ట్ వారెంటీ, 5ఏళ్లు లేదా 75వేల కి.మీల బ్యాటరీ వారెంటీ లభిస్తోంది. ఛార్జర్‌పై 2ఏళ్ల వారెంటీ మాత్రమే ఉంది.
(5 / 5)
రివోల్ట్ ఆర్వీ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 94,990గా ఉంది. సమీప డీలర్షిప్ షోరూమ్‌కి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు లేదా బుక్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు