
(1 / 5)
రియల్మీ నార్జో 80 లైట్ అనేది 4జీ స్మార్ట్‌ఫోన్. ఇందులో 6.74 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ దీని సొంతం. దీని డిజైన్ చాలా స్లిమ్‌గా ఉంటుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇందులో ఐపీ54 రేటింగ్ లభిస్తోంది. 5 కస్టమైజెబుల్ గ్లోయింగ్ మోడ్స్‌తో కూడిన పల్స్ లైట్ ఫీచర్ ఇందులో ఉంది.

(2 / 5)
ఈ రియల్మీ నార్జో 80 లైట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో యూనీఎస్ఓసీ టీ7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్మీ యూఐ 6.0 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.

(3 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ బూస్ట్, ఏఐ కాల్ నాయిస్ రిడక్షన్ 2.0 వంటి ఏఐ ఫీచర్స్‌తో పాటు మల్టీటాస్కింగ్ కోసం స్మార్ట్‌టచ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

(4 / 5)
ఈ రియల్మీ నార్జో 80 లైట్ 4జీలో 13ఎంపీ ఏఐ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉన్నాయి. ఏఐ సీన్ ఎన్హాన్స్మెంట్తో మెరుగైన ఫొటోలు తీసుకోవచ్చు.

(5 / 5)
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6300ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం హైలైట్. అంతేకాదు దీనికి 15డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సైతం లభిస్తోంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,199గా ఉంది.
ఇతర గ్యాలరీలు