330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే బైక్​ ఇది- ఇంధన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి!-checkout this high mileage bajaj freedom 125 cng bike price and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే బైక్​ ఇది- ఇంధన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి!

330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే బైక్​ ఇది- ఇంధన ఖర్చులు భారీగా ఆదా అవుతాయి!

Published Jul 06, 2025 06:40 AM IST Sharath Chitturi
Published Jul 06, 2025 06:40 AM IST

పెట్రోల్​ ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్న వారు ఇది మిస్​ అవ్వకూడదు. ఇండియాలో అత్యధిక మైలేజ్​ ఇస్తున్న బజాజ్​ ఫ్రీడమ్​ 125 సీఎన్జీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. మొత్తం 330 కి.మీ వరకు మైలేజ్​ ఇచ్చే ఈ మోడల్​ వివరాలు..

ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్​లో 125 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. సీటు కింద సీఎన్జీ ట్యాంక్‌ ఉంటుంది. 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉండటం వల్ల ఇతర 125 సీసీ మోడళ్లతో పోల్చితే దీని బరవు కాస్త ఎక్కువ ఉంటుంది.

(1 / 5)

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ బజాజ్ ఆటో ప్రకారం..  ఈఫ్రీడమ్ 125 సాంప్రదాయ 125 సీసీ పెట్రోల్ బైక్స్​తో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 50 శాతం వరకు తగ్గించగలదు.

(2 / 5)

సీఎన్జీ మోడ్​లో నడుస్తున్నప్పుడు ఈ బైక్​ 102 కి.మీ./కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఉపయోగించినప్పుడు 64 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుంది. ట్యాంక్​ ఫుల్​ చేస్తే.. ఫ్రీడమ్ 125 కేవలం సీఎన్జీపై 200 కి.మీ.ల వరకు ప్రయాణించగలదని బజాజ్ ఆటో పేర్కొంది. పెట్రోల్​ని కూడా కలుపుకుంటే అదనంగా 130 కి.మీలు, మొత్తం మీద 330 కి.మీ.ల వరకు కంబైన్డ్ మైలేజ్​ లభిస్తుందని వెల్లడించింది.

(3 / 5)

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్​లో ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రేర్​లో మోనోలింక్ సస్పెన్షన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. అదనంగా, టాప్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ సైతం ఉంటుంది. సీఎన్జీ సిలిండర్ ఉండటం వల్ల సీటు ఎత్తు 825 ఎంఎంకి చేరింది.

(4 / 5)

ఈ బజాజ్​ ఫ్రీడమ్​ 125 సీఎన్జీ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా, NG04 డ్రమ్ వేరియంట్ ధరను సంస్థ ఇటీవలే రూ. 5వేలు తగ్గించింది.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు