
(1 / 6)
మోటో జీ06 పవర్‌కి సంబంధించి ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లైవ్‌లోకి వచ్చింది. అక్టోబర్ 7న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల కానున్నట్లు కంపెనీ తెలిపింది.

(2 / 6)
మోటో జీ06 పవర్.. బడ్జెట్ ఫ్రెండ్లీ విభాగంలో అతిపెద్ద 6.88-ఇంచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది.

(3 / 6)
మోటో జీ06 పవర్ 7000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉందని సంస్థ పేర్కొంది. ఈ ఫోన్ పూర్తి ఛార్జ్ చేస్తే మూడు రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది!

(4 / 6)

(5 / 6)
మీడియాటెక్ జీ81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఇందులో ఉంది. కస్టమర్లు ఫ్యామిలీ స్పేస్, థింక్ షీల్డ్ ప్రొటెక్షన్, మోటో సెక్యూర్ కోసం కూడా మద్దతు పొందుతారు.

(6 / 6)
ఇతర ఫీచర్లు: ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఫాస్టీ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. అంటే ధ్వని నాణ్యత ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ ప్రారంభ ధర రూ. 10వేలు- రూ. 15వేల మధ్యలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. పూర్తి వివరాలు లాంచ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.
ఇతర గ్యాలరీలు