(1 / 5)
ఎంజీ విండ్సర్ ఈవీ- ఇండియాలో ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా దూసుకెళుతోంది ఈ విండ్సర్ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 14లక్షలుగా ఉంది. ఇందులో 58 కేడబ్ల్యూహెచ్, 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వరుసగా 330కి.మీ- 449 కి.మీ రేంజ్‌ని ఇస్తాయి.
(2 / 5)
టాటా నెక్సాన్ ఈవీ- టాటా మోటార్స్‌కి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది ఈ నెక్సాన్ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 12.5లక్షలుగా ఉంది. ఇందులో 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 275 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. ఇందులో 46.08 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కూడా ఉంది. దీని రేంజ్ దాదాపు 490 కి.మీ.
(3 / 5)
టాటా పంచ్ ఈవీ- టాటా నుంచి అందుబాటులో ఉన్న మరో మోడల్ ఈ టాటా పంచ్ ఈవీ. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 9.99లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ మోడల్ రూ. 14.45లక్షలకే లభిస్తుండటం విశేషం! ఇందులోని 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తే 315 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అదే సమయంలో 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ 421 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది.
(4 / 5)
సిట్రోయెన్ ఈసీ3- ఇండియాలో రూ. 15లక్షల బడ్జెట్లోపు అందుబాటులో ఉన్న మరో ఎలక్ట్రిక్ కారు ఈ సిట్రోయెన్ ఈసీ3. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం దర రూ. 13లక్షల వరకు ఉంది. ఇందులో 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది.
(5 / 5)
విండ్సర్ ఈవీ ప్రో- రూ.15లక్షలకు మించి, ఇంకాస్త ఎక్కువ ఖర్చు చేయగలిగితే.. ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోని మీరు పరిగణించవచ్చు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 18.10లక్షలుగా ఉంది. ఇందులో 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. దీని రేంజ్ దాదాపు 450 కి.మీలు.
ఇతర గ్యాలరీలు