(1 / 7)
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో శాంసంగ్, మోటరోలా స్మార్ట్ పోన్లు వినియోగదారులకు అందిస్తున్నాయి. మీరు కూడా సరసమైన ధరలో మీ కోసం ఫోన్ పొందాలని ఆలోచిస్తుంటే.. బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. 9 వేల రూపాయల కంటే తక్కువ ధరలో వస్తున్న మోటరోలా, శాంసంగ్ ఫోన్ల గురించి చూద్దాం..
(2 / 7)
శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ : ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.7999కు అందుబాటులో ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయి.
(3 / 7)
శాంసంగ్ గెలాక్సీ ఎ03 : 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ అమెజాన్ ఇండియాలో రూ .7999కు లభిస్తుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
(4 / 7)
శాంసంగ్ గెలాక్సీ ఎం05 : ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.6249. ఈ ఫోన్లో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఇది 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్.
(5 / 7)
మోటోరోలా ఈ13 : 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,999. ఈ ఫోన్లో 6.5 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తోంది.
(6 / 7)
మోటరోలా ఈ7 పవర్ : 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.8999తో ఫ్లిప్ కార్ట్‌లో లిస్ట్ అయింది. ఈ ఫోన్లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్. హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఫోన్ డాల్బీ అట్మోస్ సౌండ్ ను అందిస్తుంది.
(7 / 7)
మోటరోలా జీ05 4జీ : అమెజాన్ ఇండియాలో 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,098. ఇందులో 5200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ డాల్బీ సౌండ్ తో వస్తుంది.
ఇతర గ్యాలరీలు