(1 / 4)
రివర్ ఇండీలో 6.7 కేబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 8.9 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్. ఇందులోని 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 161 కి.మీ ఐడీసీ రేంజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
(2 / 4)
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ని 5 గంటల్లో 0-80శాతం ఛార్జ్ చేయవచ్చు. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. అవి ఈకో, రైడ్, రష్.
(3 / 4)
రివర్ ఇండీలో 12 లీటర్ల గ్లోవ్‌బాక్స్, 43 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్‌తో కలుపుకుని మొత్తం మీద 55 లీటర్ల స్టోరేజ్ లభిస్తోంది. ఫ్రెంట్ ఫుట్‌పెగ్స్, 14 ఇంచ్ వీల్స్ వంటివి రైడింగ్‌ని సౌకర్యవంతం చేస్తాయి.
(4 / 4)
హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్‌లో ఈ రివర్ ఇండీ ఎక్స్‌షోరూం ధర రూ. 1,42,999గా ఉంది.
ఇతర గ్యాలరీలు