
(1 / 6)
సంతోషకరమైన వైవాహిక జీవితానికి ప్రధానమైన అంశాలలో శృంగారం కూడా ఒకటి. అయితే పురుషులలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతే అది వారి వైవాహిక్ జీవితంలో అసంతృప్తిని రగిలించవచ్చు. లైంగిక సామర్థ్యం పెరగటానికి పురుషులు కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. అవేంటో చూడండి.
(Freepik)

(2 / 6)
అధిక బరువు నియంత్రణ: మద్యపానం, ఫాస్ట్ ఫుడ్ ప్రభావంతో, బరువు వేగంగా పెరుగుతారు. ఊబకాయం కారణంగా సరైన సమయంలో ఉద్రేకం లేకపోవడం, స్పెర్మ్ లోపం, శీఘ్ర స్కలనం వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అధిక బరువును నియంత్రించడం ముఖ్యం.
(Freepik)

(3 / 6)
పోషకాల లోపం: పోషకాల లోపం సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి పురుషులు అల్లం, వెల్లుల్లి, ఖర్జూరం, బాదం వంటి ఆహారాలు తీసుకుంటే అవి లైంగిక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
(Freepik)

(4 / 6)
నిద్ర లేకపోవడం: నిద్రపోలేమి శరీరంపై చెడు ప్రభావాలు చూపుతుంది, లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రతిరోజూ ఆరు నుండి ఏడు గంటల నిద్ర మీకు చాలా అవసరం.
(Freepik)

(5 / 6)
ఒత్తిడి: రోజూవారీ పని ఒత్తిడి, ఆందోళన ఫలితంగా అలసిపోయి సెక్స్ చేయాలనే కోరిక బాగా తగ్గిపోతుంది. పనివేళలు తగ్గించుకోండి, ఒత్తిడి నియంత్రించే ధ్యానం లాంటివి చేయండి.
(Freepik)

(6 / 6)
ధూమపానం - మద్యపానం: ధూమపానం, మద్యపానం లైంగిక జీవితానికి ప్రధాన అడ్డంకులు. ఈ రెండు కారకాల వల్ల లైంగిక శక్తి బాగా తగ్గిపోతుంది. కాబట్టి మానేయాలి.
(Freepik)ఇతర గ్యాలరీలు