
(1 / 6)
వేములవాడ రాజన్న భక్తులకు అధికారులు కీలక అలర్ట్ ఇచ్చారు. ఇవాళ్టి(అక్టోబర్ 12) నుంచి స్వామివారి దర్శనాలు నిలిపివేయబడనున్నాయి. ఇందుకు బదులుగా భీమేశ్వరస్వామి వారి ఆలయంలో దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

(2 / 6)
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం(అక్టోబర్ 12) నుంచి భక్తుల దర్శనాలకు భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు చేశారు.
(@spsircilla)
(3 / 6)
మార్పులకు సంబంధించి ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎల్.రమాదేవి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మార్పును గమనించి భక్తులంతా భీమేశ్వరం ఆలయంలో దర్శనాలు చేసుకోవాలని సూచించారు.

(4 / 6)
ముఖ్యంగా కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, ఇతర పూజలన్నీ భీమేశ్వరస్వామి వారి ఆలయంలోనే చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

(5 / 6)
ప్రధాన ఆలయం విస్తరణలో భాగంగా కొన్ని నెలల పాటు దర్శనాల నిలిపివేయనున్నారు. అయితే ప్రధాన ఆలయంలోని రాజన్న ఆలయంలోని స్వామివారికి అభిషేకాలు, పూజలు,నైవేద్యాలు, ఇతర అన్నిరకాల కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయి.

(6 / 6)
నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దేవాలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఆలయం శోభాయమానంగా మారింది.
ఇతర గ్యాలరీలు